ఏపీ చీఫ్ విఫ్ ఎదుటే వెలుగు యానిమెటర్ ఆత్మహత్య యత్నం

Update: 2019-06-30 17:10 GMT

కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలోని దిన్నెపాడు గ్రామ పంచాయతీకి పెద్దపల్లె హరిజనవాడకు చెందిన వెలుగు యానిమేటర్ ఓబులేశు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ప్రభుత్వ ఛీప్ విఫ్, స్ధానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎదుట సూపర్ వాసుమోల్ త్రాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా అక్కడే ఉన్న ఛీఫ్ విఫ్ శ్రీకాంత్ రెడ్డి అడ్డుకున్న సంఘటన లక్కిరెడ్డిపల్లె మండల సభ భవనంలో జరిగిన మండల సమావేశంలో చోటుచేసుకుంది. గత ఐదు సంవత్సరాల నుంచి వెలుగు కార్యాలయంలో యానిమెటర్‌గా పని చేస్తున్న ఓబులేశు ను రెండు రోజుల క్రితం ఏపీఎం శ్రీనివాసులురెడ్డి విధులను నుండి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి విధులకు హాజరు కావద్దని చెప్పడంతో ఓబులేశు మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు సిద్దమయ్యాడు

Tags:    

Similar News