సీఎం జగన్‌కు అమిత్ షా ఫోన్.. లాక్ డౌన్ పై ఆసక్తికర చర్చ

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఈ విషయాన్ని సీఎం జగన్ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో తెలియజేశారు.

Update: 2020-04-26 12:13 GMT
Amit shah, YS Jaganmohan Reddy(File photo)

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఈ విషయాన్ని సీఎం జగన్ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో తెలియజేశారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీశారు. లాక్ డౌన్ అమలు కేంద్రం విధించిన సడలింపులు తర్వాత నెలకొన్న పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.

అలాగే కేంద్రం నిబంధనలు కచ్చితంగా అమలు సంభందించిన వివరాలు అడిగారు. సీఎం జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అమిత్ షాకు వివరించారు. రాష్ట్రంలో విస్త్రతంగా నిర్వహిస్తున్న కరోనా పరీక్షల విషయాన్ని తెలియజేశారు. ప్రతి 10 లక్షల మంది జనాభాకు 12,74 మంది చొప్పున పరీక్షలు నిర్వహిస్తున్నామని, పరీక్షలలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని అమిత్ షాకు తెలిపారు. గుజరాత్‌లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన మత్స్యకారులను రప్పించే విషయంపై కూడా చర్చ జరిగింది.

కరోనా నివారణా చర్యలకోసం రాష్ట్రానికి చెందిన కేంద్రం తరఫున నోడల్‌ మంత్రిగా వ్యవహరిస్తున్న నిర్మలా సీతారామన్‌తో ఫోన్‌లో సంభాషించి సీఎం జగన్ అమిత్ షాకు వివరించారు. సీనియర్‌ అధికారి సతీష్‌ చంద్ర చూసుకుంటారంటూ.. తాను కేంద్ర మంత్రికి తెలియజేశానని, ఆమేరకు ఆమె∙కార్యాలయం నుంచి కూడా ఒక అధికారిని అప్పగించారని తెలిపారు.

గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులను తెప్పించడంపై ఇప్పటికే తాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, ఇద్దరి మధ్య సమన్వయం చేసి .. తెలుగు మత్స్యకారులను గుజరాత్‌ నుంచి ఆంధ్రప్రదేశ్ కి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తానంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారని సీఎం జగన్ తెలియజేశారు. సముద్రమార్గం ద్వారా వారిని రాష్ట్రానికి తీసుకురావడానికి నౌకకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖనుంచి, పలు విభాగాలనుంచి అనుమతులు రావాల్సిఉందని, దీనికి చాలా సమయం పడుతుందని అధికారులు నివేదించిన నేపథ్యంలో ఈ ప్రయత్నాలు చేసినట్టు జగన్ చెప్పారు

Tags:    

Similar News