Tirumala: తిరుమలలో ఉగాదిరోజున శ్రీవారికి ఉగాది ఆస్థానం

Tirumala: అంగరంగ వైభవంగా శ్రీవేంకటేశ్వరుని వేడుకలు

Update: 2024-04-07 08:32 GMT

Tirumala: తిరుమలలో ఉగాదిరోజున శ్రీవారికి ఉగాది ఆస్థానం

Tirumala: ఉగాది తెలుగు వారి తొలిపండుగ. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరిగే ఈ వేడుక తెలుగు వారి ఎంతో ప్రత్యేక మైనది. ఈరోజున తిరుమలలో శ్రీవారికి ఉగాది ఆస్థానాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఉగాది రోజున స్వామి వారికి తిరుమంజనం చేసి, సహస్రనామార్చనం తర్వాత పట్టుపీతాంబరాలతో, వజ్రాభరణాలతో అలంకరించి సర్వభూపాల వాహనం మీద వేంచేపు చేస్తారు. ఆ తర్వాత స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈరోజున రోజు వారీ జరిగే ఆర్జిత సేవలు ఉండవు.

ఈ రోజు ఉగాది ఆస్థానంలో ప్రత్యేకత ఏమిటంటే తిరుమల ఆస్థాన సిద్దాంతి శ్రీవారి ఉత్సవ మూర్తులకు నూతన సంవత్సర ఫలితాలను తెలియజేస్తారు. అందులో దేశక్షేమాన్ని గురించి, లాభ నష్టాలు, నవగ్రహాల సంచారం, సస్యవృద్ధి, పశువృద్ధి, కాలంలో జరిగే మార్పులను, ఆదాయ వ్యయాల గురించి వివరిస్తారు. స్వామి మనపై దయ తలస్తే.. ఎలాంటి ఆపదలనుంచైనా గట్టెక్కవచ్చనేది ఈ పంచాంగ పఠనం ఉద్దేశం. పంచాంగ శ్రవణం నివేదిక తర్వాత స్వామి వారికి భక్తులందరి తరపున ప్రత్యేక హారతిని ఇస్తారు. కాలపురుషుడైన శ్రీవారిని ఉగాది రోజున పూజిస్తే మనకు అద్భుతాలు జరుగుతాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. 

Tags:    

Similar News