ఏపీలో రెండు భారీ పరశ్రమలు.. ఆ జిల్లాలోనే మూడు..

ఏపీ ప్రజలకు శుభవార్త అందింది. రెండు భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.

Update: 2020-04-26 05:30 GMT

ఏపీ ప్రజలకు శుభవార్త అందింది. రెండు భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. పరిశ్రమల ప్రారంభానికి సంబంధిత జీవోను సడలిస్తూ పరిశ్రమల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు పరిశ్రమల్ని అనంతపురం జిల్లాలో ప్రారంభించనుంది.

అనంతపురం జిల్లాలో 2017లో కియా మోటార్స్‌ ఏర్పాటు చేసే సమయంలో అప్పటి సర్కార్ జీవో నంబర్ 151 జారీ చేసింది. ఆ జీవో ప్రకారం కియా మోటార్స్ చుట్టుపక్కల కాలుష్య కారకమైన పరిశ్రమలు స్థాపించేందుకు అనుమతులు నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే తాజాగా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆ జీవో నుంచి ఈ రెండు పరిశ్రమలకు మినహాయింపు ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు.

దీంతో వీర్ వాహన్ ఉద్యోగ్ లిమిటెడ్‌ పరిశ్రమ సుమారు వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో 120 ఎకరాల్లో ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ యూనిట్ ఏర్పాటు చేయబోతుంది. అలాగే ఏపీఐఐసీ భాగస్వామ్యంతో ఏపీ ఏరోస్పేస్‌ అండ్ డిఫెన్స్‌ ఎలక్ట్రానిక్స్‌ పార్క్‌లు అనంతపురం జిల్లాకు రానున్నాయి. తాజాగా మరో రెండు పరిశ్రమలు రావడంతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని రాయలసీమ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News