శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..

తిరుమల తిరుపతి దేవాస్థానం (టీటీడీ) బోర్డు శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది.

Update: 2020-04-25 12:47 GMT

తిరుమల తిరుపతి దేవాస్థానం (టీటీడీ) బోర్డు శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది.కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. టీటీడీ బోర్డు ముందుగానే శ్రీవారి భక్తులకు దర్శనాలు నిలిపివేసింది. ఈ తరుణంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైయ్యారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఓ గుడ్ న్యూస్ చెప్పారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుమలేశుని భక్తుల కోసం వేద పారాయణం ప్రత్యక్ష ప్రసారం చేయిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకే శ్రీవారి దర్శనాలు నిలిపివేశామని తెలిపారు. కరోనా సమస్య తొలగించాలని ధన్వంతరి యాగం నిర్వహించినట్లు చెప్పారు. 45 రోజులుగా శ్రీవారి దర్శనాలు నిలిపివేశామని, చరిత్రలో ఎప్పుడూ శ్రీవారి ఆలయాన్ని ఇన్ని రోజులు మూయలేదని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు. దేవాలయాల్లో కైంకర్యాలు అన్నీ యథావిధిగా జరుగుతాయని , ప్రతి రోజు శ్రీవారి కల్యాణోత్సవం నిరవ్వహిస్తున్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాలకు భక్తుల సంఖ్యలో పరిమితికి మించి ఉందనిచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు.అలాగే వైకుంఠ క్యూ కాంప్లేక్స్‌ల్లో మార్పులు చేపడుతున్నట్లు చెప్పారు. అన్నప్రసాదం ద్వారా ప్రతి రోజుకు 1.20 లక్షల మందికి భోజనం అందిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కోరారు.  

Tags:    

Similar News