జగన్‌ కేసులో ఈడీ ఇన్వెస్టిగేషన్‌ తీరును తప్పుబట్టిన ట్రిబ్యునల్

Update: 2019-07-14 10:36 GMT

జగన్‌ కేసులో ఈడీ ఇన్వెస్టిగేషన్‌ తీరును.. ఈడీ అప్పీలెట్‌ ట్రిబ్యునల్‌ తప్పుబట్టింది.. పెన్నా సిమెంట్స్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌ కేసులో ఈడీకి అక్షింతలు వేసింది.. పెన్నాకు భూముల కేటాయింపులో నిబంధనల ఉల్లంఘన జరగలేదన్న ట్రిబ్యునల్‌.. బలవంతంగా భూములు తీసుకున్నారని ఒక్క రైతైనా ఫిర్యాదు చేశాడా అని ప్రశ్నించింది.. 7.5 కోట్ల లబ్ధి పొందడానికి 53 కోట్లు ఇచ్చారనడం నమ్మశక్యంగా లేదన్న ట్రిబ్యునల్‌ వెళ్లడించింది.. అవి ముడుపులో.. పెట్టుబడులో నిర్ధారించే ఒక్క ఆధారమైనా ఉందా అని ప్రశ్నించిన ట్రిబ్యునల్‌.. కేసుపై ఈడీ మైండ్‌ పెట్టలేదంది.. కేవలం ఆరోపణలపై ఆస్తులు అటాచ్‌ చేయవద్దని సూచిందింది.. స్వతంత్ర సంస్థ అని చెప్పుకునే ఈడీ.. స్వతంత్రంగా ఆధారాలు సేకరించాలని పేర్కొంది. పెన్నా సిమెంట్స్‌ భూములను స్వాధీనం చేసుకోవద్దని ఈడీకి ట్రిబ్యునల్‌ ఆదేశించింది. 

Tags:    

Similar News