కాకినాడ జిల్లాలో విషాదం.. కారులో ఊపిరి ఆడక చిన్నారి మృతి
Kakinada: పక్కింటివారు రోడ్డుపై నిలిపి ఉంచిన కారులో కూర్చున్న చిన్నారి.. కారు డోర్ లాక్ పడటంతో ఊపిరాడక చిన్నారి మృతి
కాకినాడ జిల్లాలో విషాదం.. కారులో ఊపిరి ఆడక చిన్నారి మృతి
Kakinada: కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంక గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అఖిలాండేశ్వరి అనే చిన్నారి కారులో ఊపిరాడక మృతి చెందింది. పాల ప్యాకెట్ కోసం వెళ్లిన చిన్నారి...పక్కింటివారు రోడ్డుపై ఉంచిన కారులోకి వెళ్లి కూర్చుంది. అయితే ఆ కారు డోర్ లాక్ పడటంతో ఊపిరాడక చిన్నారి మృతి చెందింది. తమ కూతురు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఊరంతా వెతికారు. చివరికి ఇంటి పక్కన కారులో విగతజీవిగా కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.