నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతం వాయవ్వ ప్రాంత్రంలో నిన్న(సోమవారం) అల్పపీడనం ఏర్పడింది.

Update: 2019-08-13 03:09 GMT

తెలుగు రాష్ట్రాల్లో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతం వాయవ్వ ప్రాంత్రంలో నిన్న(సోమవారం) అల్పపీడనం ఏర్పడింది.ఇది నేడు మరింత తీవ్రం కానుంది. దీనికి తోడు 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఇక సోమవారం ఏపీ, తెలంగాణలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిశాయి. తెలంగాణలోని కొమ్మెరలో 39మి.మీ, హత్నూరులో 29.3, కల్హేర్ 22.3, ఇబ్రహీంపేటలో 20.5మి.మీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. నేడు అనేక ప్రాంతాల్లో భారీ వర్ష సూచన రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 

Tags:    

Similar News