రోడ్డుకు అడ్డంగా గోడ.. టీడీపీ వర్సెస్ పోలీసులు..

Update: 2019-07-27 07:29 GMT

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుపాడుకు వెళ్లిన టీడీపీ నిజనిర్దారణ కమిటీని పోలీసులు, వైసీపీ వర్గం అడ్డుకుంది. ఎన్నికల తర్వాత గ్రామంలో రోడ్డుకు అడ్డంగా వైసీపీ వర్గీయులు గోడ కట్టారు. దీంతో టీడీపీ సానుభూతిపరుల ఇళ్లకు దారి లేకుండా పోయింది. ఈ విషయం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లింది. వైసీపీ వర్గం దౌర్జన్యం చేస్తోందంటూ అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది.

పొనుగుపాడులో నెలకొన్న పరిస్థితిని పరిశీలించేందుకు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ వచ్చింది. దీంతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. గ్రామంలో 144 సెక్షన్ విధించారు. గ్రామంలోకి టీడీపీ నేతలు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. గ్రామంలోకి రావడానికి అనుమతి లేదని చెప్పారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. మేం గ్రామంలో ఎందుకు వెళ్లకూడదు..? అంటూ టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు-టీడీపీ నేతలకు మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది.ఈ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు గెస్ట్‌హౌస్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.



 


Tags:    

Similar News