Kakinada: నెలరోజులైన బోనుకి చిక్కని పులి

Kakinada: భయంతో బతుకుతున్నామని గ్రామస్తుల ఆగ్రహం

Update: 2022-06-16 09:34 GMT

Kakinada: నెలరోజులైన బోనుకి చిక్కని పులి

Kakinada: నెలరోజులు దాటుతున్న బోనుకి పులి చిక్కడం లేదు. అధికారులు ఎన్ని వ్యూహాలు వేసినా అన్నింటిని చిత్తు చేస్తోంది. చిక్కినట్టే చిక్కి మళ్లీ చేజారిపోయింది. తాజాగా కాకినాడ జిల్లా ప్రతిపాడు శరభవరం పంట పొలాల్లో పాడి పశువులపై పులి మళ్లీ దాడి చేసింది.

కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం శరభవరం పరిసరాల్లో పులి పశువులపై దాడికి పాల్పడింది. పెద్దపులిని చూసిన పశువులు అక్కడి నుండి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నాయి. కానీ ఓ గేదే, దూడ మాత్రం పులి పంజా నుంచి తప్పించుకోలేక గాయాలయ్యాయని బాధితుడు శ్రీను తెలిపాడు.

గత కొన్ని రోజులుగా పులి గ్రామాల్లోకి వస్తుందనే భయంతో రాత్రి పగలు తేడాలేకుండా ప్రాణభయంతో బ్రతుకుతున్నామని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసిన గుర్తులను గుర్తించడమే తప్ప పూర్తి స్థాయిలో అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోలేక పోతున్నారని గ్రామస్తుల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి.

చుట్టు ప్రక్కల గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పంట పొలాల్లోకి పనులకు వెళ్ళకుండా ఎలా బ్రతకాలని ప్రభుత్వాన్ని అటవీశాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. పులిని దాటి నుంచి ప్రజలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారో సమాధానం చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సుమారు నెల నుంచి బెంబేలెత్తిస్తున్న పులి సమస్యపై.. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి, తగు చర్యలు తీసుకోకపోతే భారీ నిరసనలు మూటకట్టుకోవడం ఖయాంగా కనిపిస్తోంది. 

Tags:    

Similar News