కాకినాడ జిల్లాలో మరోసారి పులి అలజడి.. బోను దగ్గరకు వచ్చి వెళ్లిపోయిన పెద్దపులి

*సీసీ కెమెరాల్లో రికార్డయిన పులి కదలికలు

Update: 2022-06-05 06:30 GMT

కాకినాడ జిల్లాలో మరోసారి పులి అలజడి.. బోను దగ్గరకు వచ్చి వెళ్లిపోయిన పెద్దపులి

Kakinada: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పులి వేట కొనసాగుతోంది. పులిని బంధించేందుకు అటవీశాఖ సిబ్బంది బోన్లు ఏర్పాట్లు చేశారు. అయితే నిన్న రాత్రి శరభవరంలో ఏర్పాటు చేసిన బోన్ వద్దకు పులి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. బోను దగ్గరకు వచ్చిన పెద్దపులి కాసేపటికే అక్కడ నుంచి వెళ్లిపోయింది. సీసీ కెమెరాల్లో పులి కదలికలు రికార్డయ్యాయి.

దీంతో పులి కదలికలను బట్టి అటవీ అధికారులు వ్యూహం రచిస్తున్నారు. మరో 2 బోన్లు ఏర్పాటుకు అటవీ సిబ్బంది సిద్ధమైయ్యారు. ఇప్పటికే పులి కోసం 3 బోన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు నిన్న పులి పంజాకు మరో లేగ ఆవుదూడ బలైంది. దీంతో ఫారెస్ట్ అధికారులు రక్తం మరిగిన పెద్దపులి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. పులి సంచారంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

Tags:    

Similar News