అనకాపల్లి జిల్లాలో పులి సంచారం కలకలం
Anakapalle: పులిని బంధించేందుకు అటవీ సిబ్బంది ప్రయత్నాలు
అనకాపల్లి జిల్లాలో పులి సంచారం కలకలం
Anakapalle: అనకాపల్లి జిల్లాలో పులి సంచారం కలకలం రేగింది. దీంతో పులిని బంధించేందుకు అటవీ సిబ్బంది ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అంతేకాదు.. బోను లోపల పులికి ఆహారంగా మూగజీవాలను ఉంచారు. ఇక పులికి బోనుకనిపించకుండా ఆకులతో కప్పారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే.. బోను ఏర్పాటు చేసిన ప్రాంతంలో పులి సంచరించకపోవడంతో అటవీశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు పులి ఏక్షణాన దాడి చేస్తుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.