తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. వడగళ్ల వాన పడే అవకాశం..

తెలుగు రాష్ట్రాలలో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Update: 2020-04-11 05:54 GMT

తెలుగు రాష్ట్రాలలో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.అరేబియా మధ్య ప్రాంతం నుంచి కర్నాటక మీదుగా విదర్భ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా... వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ఆది, సోమవారాల్లో ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు ఈదురు గాలులు ప్రభావం ఉంటుందని వాతావరణ సంచాలకులు వివరించారు. ఉపరితలానికి 9వందల మీటర్ల ఎత్తులో ఈ ద్రోణి కొనసాగుతోందని వెల్లడించారు. దీని ప్రభావం తెలంగాణపై అధికంగా ఉంటుందని అంచనా వేశారు.

ఏపీలో కోస్తాలోని గుంటూరు, కృష్ణ, ప్రకాశం జిల్లాలో ఒక వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు కురుస్తాయనివాతావరణ కేంద్రం వెల్లడించింది.

మరోవైపు రాష్ట్రంలో కరోనా విజృంభణతో ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతుంటే. ఇప్పుడు వర్షాలు పడి కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందని ప్రజలను భయాందోళనకు గురవుతున్నారు. అయితే లాక్ డౌన్ కావడంతో ప్రజలు బయటకు పోలేని పరిస్థితి, మిర్చి, పసుపు పంటలు చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు కురిస్తే పంట నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

Tags:    

Similar News