తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Update: 2019-01-02 03:06 GMT

ఓ వైపు చలి చంపేస్తోంది. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు పరీక్షలు జరుగుతుండటంతో తిరుమలకు భక్తుల రద్దీ తగ్గింది. నిన్న జనవరి 1 సందర్భంగా కిటకిటలాడిన తిరుమల, నేడు భక్తుల రద్దీ తగ్గిపోయింది. శ్రీవారి సర్వ దర్శనం కోసం కేవలం రెండు కంపార్ట్‌ మెంట్లలో మాత్రమే భక్తులు వేచివున్నారు. వీరికి మూడు గంటల్లోనే దర్శనం అవుతుందని అధికారులు వెల్లడించారు. ఇక టైంస్లాట్, దివ్యదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. సంక్రాంతి సెలవుల వరకూ రద్దీ కాస్తంత తక్కువగానే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆ తరువాత భక్తుల సంఖ్య పెరిగే అవకాశముంది. 

Similar News