టెన్త్ లో ఇంటర్నల్ మార్కుల ఎత్తివేత: జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం

Update: 2019-06-28 15:36 GMT

సీఎం వైఎస్ జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులు విద్యాశాఖ ఎత్తివేసింది. గతేడాది వరకూ పబ్లిక్ పరీక్షల్లో 20 శాతం ఇంటర్నల్ మార్కులు కేటాయించింది. దీంతో ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా మార్కులు వేస్తుండటంతో పాత పద్ధతికి ప్రభుత్వం స్వస్తి చెప్పింది. ఈ ఏడాది నుంచి ఆరు సబ్జెక్టులకు 11 పేపర్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. 

Tags:    

Similar News