Solar Eclipse: ఇవాళ సూర్యగ్రహణ ప్రభావంతో ఆలయాల మూసివేత
Solar Eclipse: సూర్యగ్రహణానంతరం ఆలయశుద్ధి తర్వాత దర్శనాలకు అనుమతి
Solar Eclipse: ఇవాళ సూర్యగ్రహణ ప్రభావంతో ఆలయాల మూసివేత
Solar Eclipse: ఇవాళ సూర్యగ్రహణం సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు మూతపడనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు.. ఆలయాలు మూసివేయనున్నామని ఆలయాధికారులు తెలిపారు. శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం సహా.. ప్రముఖ క్షేత్రాలల్లో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటన జారీ చేశారు . అలాగే తెలంగాణలో ముఖ్య క్షేత్రాలైన యాదాద్రి, భద్రాచలం, వేములవాడ, ధర్మపురి, బాసరతో పాటు.. ఆలయాల్లో భక్తుల్ని స్వామివారి దర్శనాలకు అనుమతించబోమని అధికారులు తెలిపారు. సూర్య గ్రహణం పూర్తయ్యాక.. ఆలయశుద్ధి చేపట్టి.. దర్శనాలకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. సూర్యగ్రహణ ప్రభావంతో ఆలయాల్లో దాదాపు 12 గంటల పాటు దర్శనాలు రద్దుచేశారు.