ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సత్తా.. ఉత్తరాంధ్రలో చిరంజీవిరావు.. తూర్పు రాయలసీమలో శ్రీకాంత్ గెలుపు
MLC Elections Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సత్తా.. ఉత్తరాంధ్రలో చిరంజీవిరావు.. తూర్పు రాయలసీమలో శ్రీకాంత్ గెలుపు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సత్తా.. ఉత్తరాంధ్రలో చిరంజీవిరావు.. తూర్పు రాయలసీమలో శ్రీకాంత్ గెలుపు
MLC Elections Results: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు రెండో ప్రాధాన్య ఓటుతో విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి ఆధిక్యం కనబరిచిన చిరంజీవి రావు.. వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి ఎన్నిక ధృవీకరణ పత్రాన్ని అందించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, టీడీపీపై ఉన్న నమ్మకమే తన గెలుపునకు ప్రధాన కారణమని చిరంజీవిరావు తెలిపారు. ఉత్తరాంధ్రలో నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ రెడ్డిపై 34వేల 110 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కంచర్ల శ్రీకాంత్‌కు మొత్తం లక్షా 24వేల 181 ఓట్లు వచ్చాయి. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి ఆయనకు డిక్లరేషన్ అందించారు.