అణచివేయాలనుకున్న ఎంతో మంది నియంతలు కాలగర్భంలో కలిసి పోయారు: నారా లోకేష్

అమరావతిలో భారీగా పొలిసు బందోబస్తు ఏర్పాటు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు..

Update: 2019-12-27 08:53 GMT
Nara Lokesh, YS Jagan (File Photo)

అమరావతిలో భారీగా పొలిసు బందోబస్తు ఏర్పాటు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు.. అడుగుకో పోలీస్ ని పెట్టారు. ప్రతి ఇంటి దగ్గరా ఐదుగురు పోలీసులా? అని ప్రశ్నించారు. ముళ్ల కంచెలు, వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్, లాఠీలు, తుపాకులా? ఎందుకు పెట్టారని రాష్ట్ర ప్రభుత్వాన్ని లోకేష్ నిలదీశారు. ప్రజా ఉద్యమాలను అణచివేయాలనుకున్న ఎంతో మంది నియంతలు కాలగర్భంలో కలిసి పోయారు.

తీసుకునే నిర్ణయం మంచిదైతే యుద్ధ వాతావరణం ఎందుకు తీసుకొచ్చారో వైకాపా మేధావులు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతి ఉంటుందని.. అక్కడ అద్భుతమైన నగరాన్ని కడతామని జగన్ చెప్పారని.. కానీ జగన్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని శాంతియుతంగా రైతులు, రైతు కూలీలు, ప్రజలు ఆందోళన చేస్తున్నారు వారిపై మీ ప్రతాపం ఏంటని నారా లోకేష్ ధ్వజమెత్తారు. 



Tags:    

Similar News