Gorantla Butchaiah: నేను చంద్రబాబును కలవను
Gorantla Butchaiah: టీడీపీలో ప్రస్తుతానికి తాను ఒంటరి వాడినంటున్నారు రాజమండ్రి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. టీడీపీనీ వీడే అంశంపై త్వరలోనే తన నిర్ణయాన్ని తెలియ చేస్తానన్నారు. పార్టీ నిర్వహణలో చాలా లోపాలున్నాయని, ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబును తాను నేరుగా కలవబోనని అన్నారు. పార్టీలో ఇతర నేతలు కలసి తన ఆవేదనను తెలియ చేస్తారని ఆ తర్వాతే తాను నిర్ణయం తీసుకుంటాననీ అన్నారు.