ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారు...?

Andhra News: పొత్తుపై పవన్ కల్యాణ్‌తో నేడు బీజేపీ పెద్దల చర్చలు

Update: 2024-02-08 07:45 GMT

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారు...?

Andhra News: ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. మూడు పార్టీల పొత్తుపై పవన్ కల్యాణ్‌తో బీజేపీ పెద్దలు నేడు భేటీ కానున్నారు. చంద్రబాబుతో అమిత్ షా, జేపీ నడ్డాలు ఇప్పటికే చర్చలు జరిపారు. నిన్నటి భేటీలో పొత్తుపై కాస్త క్లారిటీ రాగా.... నేడు పవన్‌తో భేటీ అనంతరం పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 2014 ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి వెళ్లడంతో ఏపీలో విజయం సాధించామని.... ఈసారి కూడా మూడు పార్టీలు కలిసి వెళ్తే ఏపీలో అధికారంలోకి వస్తామనే భావనలో పవన్ కల్యాణ్ ఉన్నారు. మూడు పార్టీల మధ్య పొత్తు కోసం మొదట నుంచి పవన్ కల్యాణ్ పట్టుబడుతున్నారు.

పొత్త దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉండటంతో సీట్ల పంపకాలపై సైతం చంద్రబాబుతో అమిత్ షా నిన్న చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు 23, బీజేపీకి 12 ఎమ్మెల్యే టికెట్లు దక్కే ఛాన్స్ ఉంది. ఇక పార్లమెంట్ విషయానికి వస్తే జనసేనకు రెండు, బీజేపీకి 5 టికెట్లు దక్కనున్నాయని సమాచారం. హిందుపురం ఎంపీగా బీజేపీ నుంచి స్వామి పరిపూర్ణానంద పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది క్లారిటీ రావాల్సి ఉంది. 

Tags:    

Similar News