సమావేశాలకు టీడీపీ సిద్ధం.. మండలిలో ప్రభుత్వ వ్యూహం ఏంటీ?

శాసన సభ సమావేశాలకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మంగళగిరిలోని పార్టీ సెంట్రల్ ఆఫీసులు టీడీఎల్పీ భేటీ జరగనుంది.

Update: 2020-01-18 07:30 GMT

శాసన సభ సమావేశాలకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మంగళగిరిలోని పార్టీ సెంట్రల్ ఆఫీసులు టీడీఎల్పీ భేటీ జరగనుంది. అలాగే మధ్యాహ్నం ముఖ్యనేతలతో స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. సమావేశాలకు ప్రతి ఒక్కరు తప్పకుండా హాజరు కావాలంటూ విప్ జారీ చేసింది. విప్ పరిధిలోకి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ లను కూడా తీసుకువచ్చింది. రాజధాని తరలింపును అడ్డుకోవాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది.

మండలిలో ప్రవేశపెట్టే బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి ప్రభుత్వానికి షాక్ ఇవ్వాలని భావిస్తోంది. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాలు జరగకుండా ఉండేందుకు ఈనెల 20న ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది ఆ పార్టీ. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని టీడీపీ కార్యకర్తలను సమాయత్తం చేస్తోంది. మరోవైపు మండలి లో రాజధాని తరలింపు బిల్లును టీడీపీ అడ్డుకుంటుందని భావిస్తున్న వైసీపీ.. మండలిని తాత్కాలికంగా రద్దు చెయ్యాలన్న వ్యూహాన్ని రచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే మండలిని ఇప్పటివరకు తాత్కాలికంగా రద్దు చేసిన సందర్భాలు లేవు. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సభ్యులు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువమంది ఉన్నారన్న కారణంతో అప్పట్లో మండలి వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు. కానీ 2007 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవస్థను పునరుద్ధరించారు. ఒకవేళ ప్రస్తుత మండలి రద్దు అవుతే మాత్రం టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఆ పార్టీకి ప్రస్తుతం 23 మంది సభ్యులు ఉన్నారు. వారంతా అనర్హులుగా పరిగణింపబడతారు.

ఒకవేళ తాత్కాలికంగా రద్దు చేస్తే మాత్రం టీడీపీకి నష్టమేమి జరగక పోవచ్చు. అయితే ఇది ప్రభుత్వానికి న్యాయపరమైన చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం లేకపోలేదు. crda చట్టం చేసినప్పుడు ఉభయ సభల్లో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఇప్పుడు రద్దు చెయ్యాలన్నా కూడా రెండు సభల ఆమోదం ఉండాలని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. మరి ఇలాంటి సమయంలో మండలిని ప్రభుత్వం రద్దు చేస్తుందా? లేకా ఇంకేమైనా వ్యహం రచిస్తుందా అనేది చూడాలి.  

Tags:    

Similar News