సంతోషం జగన్.. చంద్రబాబు రిప్లై
ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (ఏప్రిల్ 20) న 70 పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (ఏప్రిల్ 20) న 70 పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు చంద్రబాబుకి సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకి ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 'చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి' అంటూ జగన్ ట్వీట్ చేశారు
సీఎం జగన్మోహన్ రెడ్డి ట్వీట్‌కు కృతజ్ఞతగా టీడీపీ అధినేత చంద్రబాబు రిప్లై ఇచ్చారు. దీనిపై స్పందించిన చంద్రబాబు. ''ధన్యవాదాలు... సంతోషమయ్యా జగన్'' అంటూ రిప్లై ఇచ్చారు. అయితే అధికార, ప్రతిపక్ష నేతల మధ్య పరస్పర ట్వీట్లపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు పార్టీ కార్యకర్తలు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు తనకు బర్త్ డే విషష్ చెప్పిన వారికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. కరోనా ప్రభావం కారణంగా ఈ సారి చంద్రబాబు తన జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. తన మనవడు దేవాన్ష్ తో కలిసి సరదాగా గడిపారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అభిమానులకు కరోనాపై అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. కరోనా వ్యాపించకుండా ఉండాలని ప్రభుత్వాలు చెప్పే సూచనలు పాటించాలని కోరారు.