టీడీపీ ఆధ్వర్యంలో రేపు రాష్ట్ర బంద్ ఉంటుందా?

మూడు రాజధానుల స్థాపనపై జిఎన్ రావు కమిటీ సిఫారసులను ఆమోదించడం తోపాటు, అమరావతి నిర్మాణం కోసం..

Update: 2019-12-27 03:10 GMT

మూడు రాజధానుల స్థాపనపై జిఎన్ రావు కమిటీ సిఫారసులను ఆమోదించడం తోపాటు, అమరావతి నిర్మాణం కోసం ఏపీ సిఆర్‌డిఎకు తమ భూములను త్యాగం చేసిన అమరావతి రైతుల మనోవేదనలను పరిష్కరించడానికి ఎపి క్యాబినెట్.. క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.. కేబినెట్ ఈరోజు(డిసెంబర్ 27)న ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్‌లో ప్రారంభం కానుంది. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలు, ఇతర ప్రాంతాలలో ప్రజల నిరసనల గురించి కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో వివిధ సంస్థలకు భూమిని కేటాయించే ప్రతిపాదనలను కూడా కేబినెట్ ఆమోదిస్తుందని సిఎంఓ వర్గాలు తెలిపాయి.

జిఎన్ రావు కమిటీ సిఫారసులను ఆమోదించిన తరువాత, ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు ప్రభుత్వం భరోసా ఇస్తుందని అధికార పార్టీలోని ఒక సీనియర్ నాయకుడు సమాచారం ఇచ్చారు. ఇదిలావుంటే కేబినెట్ సమావేశంలో అమరావతి ఉనికిపై రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రతికూల నిర్ణయం తీసుకుంటే, డిసెంబర్ 28న రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునివ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు ఈ విషయాన్ని ప్రకటించారు. 

Tags:    

Similar News