మొంథా తుఫాన్ ప్రభావం.. నీటమునిగిన చోడవరంలోని స్వయంభూ విఘ్నేశ్వరుడు
అనకాపల్లి జిల్లా చోడవరంలో నీటమునిగిన స్వయంభూ విగ్నేశ్వరుడు మొంథా తుఫాన్ కారణంగా గణపయ్య గర్భగుడిలోకి చేరిన నీరు 2వందల ఏళ్ల చరిత్ర కలిగిన స్వయంభూ విగ్నేశ్వర ఆలయం
మొంథా తుఫాన్ ప్రభావం.. నీటమునిగిన చోడవరంలోని స్వయంభూ విఘ్నేశ్వరుడు
మొంథా తుఫాన్ కారణంగా అనకాపల్లి జిల్లా చోడవరంలో స్వయంభూ విగ్నేశ్వర స్వామి నీట మునిగాడు. రాష్ట్రంలో కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడు స్వయంగా వెలిసిన దేవుడు కాగా.. ఆ తర్వాత స్వయంభూగా వెలిసిన విఘ్నేశ్వర స్వామి.. చోడవరంలో ఉన్నట్లు అర్చకులు తెలిపారు. బావిలో ఉన్న గణపయ్య విగ్రహం నానాటికీ పెరిగిపోతోందని చెబుతున్నారు. సుమారు 90ఏళ్ల క్రితం ముప్పావు కేజీ వెండితో స్వామికి కిరీటం చేయించగా.. ఇప్పుడు ఆ కిరీటం పెంచుతూ రెండు కేజీలతో చేయించాల్సి వచ్చిందన్నారు. ఎంటువంటి కార్యాలైన స్వామిని దర్శించుకుని వెళ్తే శుభం జరుగుతుందని భక్తులు నమ్ముతున్నారు. తుఫాన్ వలన గణపతి గర్భగుడి నీటిలో మునిగిపోవడంతో.. జల గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.