పెళ్లి ఊరేగింపులా ఉపాధ్యాయుడి పదవి విరమణ వేడుక

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేసిన చోడే వెంకటేశ్వర ప్రకాశానికి అరుదైన గౌరవం దక్కింది.

Update: 2020-03-01 06:09 GMT

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేసిన చోడే వెంకటేశ్వర ప్రకాశానికి అరుదైన గౌరవం దక్కింది. గత 19 ఏళ్లుగా అదే పాఠశాలలో అయన తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేసి పదవీవిరమణ పొందారు. దీంతో విద్యార్థులు ఆయన్ను విద్యార్థులు పల్లకిలో కూర్చోబెట్టి భుజాలపై మోసుకుంటూ గ్రామమంతా ఊరేగించారు.

ఉపాధ్యాయుడు పదవి విరమణ కార్యక్రమం పెళ్లి ఊరేగింపులా సాగింది. అనంతరం పాఠశాల ప్రాంగణంలో జరిగిన సత్కారసభలో పూర్వ విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొనిఘనంగా సన్మానించారు. ఇంత అరుదైన గౌరవం దక్కడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు ఆ ఉపాధ్యాయుడు. గతంలో ఆయన ఎందరో పేద విద్యార్థులకు అర్థికంగా సహాయపడ్డారు. అందుకే తమ ప్రియమైన ఉపాధ్యాయుడికి గుర్తిండిపోయేలా ఇలా వేడుక నిర్వహించారు ఆ విద్యార్థులు.



Tags:    

Similar News