రేపటి నుండి విజయవాడ సిటిలో కఠిన ఆంక్షలు

Update: 2020-03-23 17:43 GMT
Vijayawada janata Curfew

కరోనా కల్లోలంలో విజయవాడ చిక్కుకుంది. ప్రజలు స్వచ్చందంగా నిర్భంధాన్ని పాటించాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపు తో చాల వరకూ ఇళ్లలోనే ఉండిపోయారు. అయితే, అక్కడక్కడ మాత్రం నిషేధాజ్ఞలు ఉల్లంఘించి రోడ్ల మీదకు రావడం కనిపించింది. దీంతో అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. విజయవాడ మున్సిపల్ కమీషనర్ ప్రసన్న వెంకటేష్ ఈ విషయం పై ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు కేవలం రోజుకు మూడు గంటలు మాత్రమె రోదల్ మీదకు వచ్చేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

రేపటి నుంచి ఈ క్రింది నిబంధనలు ఈ నెల 31 వరకూ అమలులో ఉంటాయని తెలిపారు.

- మార్చి 24 నుంచి ఉదయం 6 నుండి ఉదయం 9 గంటల వరకే ప్రజలకు బయట తిరిగేందుకు అనుమతి ఇస్తున్నారు. 

- పచారి షాపులు, పళ్లుమార్కెట్, రైతు బజార్లు,  కాళేశ్వరరావు మార్కెట్ కి మాత్రమే ఉ.6 నుండి 9 వరుకు తెరిచి ఉంటాయి..

- ఉదయం 4 నుండి ఉదయం 8 వరుకు మిల్స్ & డైరి ప్రొడెక్ట్ అందుబాటులో ఉంటాయి..

- ఉదయం 5 నుండి ఉదయం 9 వరుకు ఏటీయం ఫిల్లింగ్ వెహికల్స్ కు అనుమతి.

- ఉదయం 7 నుండి సాయంత్రం 7 వరుకు టెక్ ఎ వే హోటల్స్ కు అనుమతి

ప్రభుత్వ, పోలీస్, ఫైర్ ,ఎలక్ట్రసిటి, రెవిన్యూ , వీయంసీ , మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంటు వెహికల్స్ కు మాత్రమే అనుమతి

ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా వెహికల్స్ కు, ఆయిల్ & గ్యాస్ ఫిల్లింగ్ వెహికల్స్, మొబైల్ కమ్యునికేషన్స్ వెహికల్స్ కు ప్రత్యేక అనుమతి

జ్యూవలరీ, పెద్ద మాల్స్, ఎలక్ట్రానిక్ షాప్స్ ,క్లాత్ స్టోర్స్, ఫ్యాన్సీ షాప్స్, హార్డ్ వెర్ ,ఫర్నిచర్ , బేకరీస్ & ఐస్ క్రీమ్ పార్లర్స్, రెడీమేడ్ షాప్స్, హోటల్స్ & రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్, ఐరన్ & స్టీల్ షాప్స్, గ్లాస్ & ప్లైవుడ్ షాప్స్, పిజ్జాకాఫీ షాప్స్, మొబైల్ షాప్స్, ఆటోమొబైల్స్ & ఆటోనగర్ లాక్ డౌన్ అయ్యేవరుకు ఓపెన్ కు అనుమతి లేదు...

పదిమంది ఎక్కడా గుమిగూడి ఉండద్దని పోలీసులు హెచ్చరించారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. 


Tags:    

Similar News