ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతికి ప్రత్యేక రైలు

సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైలును జనవరి నెలలో నడపనున్నట్లు దక్షిణ మధ్యరైల్వే తెలిపింది.

Update: 2019-12-27 04:05 GMT

సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుంచి లింగంపల్లికి, లింగంపల్లి నుంచి కాకినాడకు ప్రత్యేక రైలును జనవరి నెలలో నడపనున్నట్లు దక్షిణ మధ్యరైల్వే తెలిపింది. ఈ రైలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మీదుగా జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నడుపుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. కాకినాడ నుంచి బయలుదేరే రైలు సోమ, బుధ, శుక్రవారాలలో బయలుదేరుతుందని వెల్లడించారు.

02775 నెంబరు గల రైలు జనవరి 1, 3, 6, 8, 10, 13, 15, 17, 20, 22, 24, 27, 29, 31 తేదీలలో కాకినాడలో రాత్రి 20:10 నిమిషాలకు బయలుదేరి భీమవరం కు 22:23 నిమిషాలకు వస్తుంది.. లింగంపల్లికి ఉదయం 7:30 నిమిషాలకు చేరుకుంటుంది.

లింగంపల్లి నుంచి కాకినాడకు వచ్చే 02776 నెంబరు గల రైలు జనవరి 2, 4, 7, 9, 11, 14, 16, 18, 21, 23, 25, 28, 30 తేదీలలో లింగంపల్లిలో రాత్రి 19:55 నిమిషాలకు బయలు దేరి భీమవరానికి 3:58 నిమిషాలకు వస్తుంది.. ఆ తరువాత ఉదయం 7:15 నిమిషాలకు కాకినాడకు చేరుకుంటుంది. 

Tags:    

Similar News