ఎమ్మెల్యే తీరుకు స్థానికులు శెభాష్..లీడరంటే ఇలా ఉండాలంటున్న ప్రజలు

Update: 2019-06-25 13:47 GMT

ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా, ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ఉంటే ప్రజలు వారిని దేవుడిలా కొలుస్తారు. అందుకు నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేనే సాక్ష్యం ప్రజల కష్టం తన కష్టంలా భావించే ఆ ఎమ్మెల్యే ఇప్పుడు అందరి ప్రశంసలూ అందుకుంటున్నారు. ఎమ్మెల్యే అంటే ప్రజలకు చేరువగా ఉండాలి వారి సమస్యలను అర్ధం చేసుకోవాలి. ఒక భరోసా ఇవ్వాలి వారి సంక్షేమాన్ని కాంక్షించాలి చాలా తక్కువ మంది ప్రజా ప్రతినిధులకు ఈ అలవాటు, సేవ చేయాలన్న తపన ఉంటుంది అలాంటి కోవకే చెందుతారు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.

విడవలూరు మండలం ఊటుకూరు పెదపాలెంలో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు బోరు బావి లో పడిపోయారు. వారిని వెలికి తీయడానికి స్థానిక యంత్రాంగం, అధికారులు అక్కడకు చేరుకున్నారు. అన్నా చెల్లెళ్లు ఇద్దరూ ఒకరిపై ఒకరు పడిపోవడంతో వారిని రక్షించడానికి చుట్టుపక్కల జనాలు, స్థానిక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయానికి స్థానిక ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గ్రామంలో పర్యటిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆయన అధికారులను ఎలర్ట్ చేశారు. తక్షణ సహాయక చర్యలకోసం ఆదేశించడమే కాదు దగ్గరుండి వాటిని పర్యవేక్షించారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చూపిన చొరవకు, బాధ్యతాయుతంగా వ్యవహరించిన తీరుకు స్థానికులు మురిసిపోయారు. లీడర్ అంటే ఆయనేనని మెచ్చుకున్నారు. ప్రజలకు కష‌్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తన కష్టంగా భావించిన వాడే అసలైన లీడరని అని వారంటున్నారు.

ఎమ్మెల్యే తీరుకు స్థానికులు శెభాష్ అంటున్నారు లీడరంటే ఇలా ఉండాలంటున్నారు. కొన ఊపిరితో ఉన్న చిన్నారి మోక్షితను సజీవంగా వెలికి తీసినా ఆస్పత్రికి తరలించే సరికి ప్రాణం వదిలిందని తెలుస్తోంది. సకాలంలో ఆస్పత్రికి తరలించినా, ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు ఉండి ఉన్నా చిన్నారి ప్రాణం మిగిలేది. ఈ సంఘటన గతంలో తెలంగాణలో తాండూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి వ్యవహరించిన తీరు గుర్తుకు తెచ్చింది అప్పట్లో చేవెళ్లలో బోరు బావిలో ఒక చిన్నారి పడిపోవడంతో దాదాపు 16 గంటలు అక్కడే ఉండి సహయక చర్యలను ఆయన పర్యవేక్షించారు. కానీ పాపను సజీవంగా వెలికి తీయలేకపోయారు.

Full View

Tags:    

Similar News