కరోనా ఎఫెక్ట్: అమ్మాయి అబ్బాయి ఏడుగురు పెద్దలు..పెళ్లితంతు పూర్తి!

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని రంగాల‌ను దెబ్బ‌తీసింది. ఈ మ‌హ‌మ్మ‌రి భార‌త్ లోనూ వేగంగా వ్యాపించింది.

Update: 2020-04-10 12:39 GMT

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని రంగాల‌ను దెబ్బ‌తీసింది. ఈ మ‌హ‌మ్మ‌రి భార‌త్ లోనూ వేగంగా వ్యాపించింది. ఈ నేప‌థ్యంలో క‌రోనా వైర‌స్ నివార‌ణ‌లో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం 21రోజుల‌పాటు లాక్ డౌన్ ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో ప్రాణాంత‌క వైర‌స్ ప్ర‌భ‌ల‌కుండా ఉండేందుకు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఈ మ‌హ‌మ్మ‌రిపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించే కార్య‌క్ర‌మాలు చెప‌డుతున్నాయి.

అంతే ప్ర‌జ‌లు ఎక్క‌డా గుమికుడ‌కుండా ఉండేంద‌కు స‌భ‌లు స‌మావేశాల‌కు అనుమ‌తులు నిరాక‌రించింది. ఇక పెళ్లిల్లు, ఇత‌ర ఫంక్ష‌న్లను పరిస్థితుల‌ను చ‌క్క‌బ‌డే వ‌ర‌కు ర‌ద్దు చేసుకోవాల‌ని తెలిపింది. సామాజిక దూరం పాటించి ఈ మ‌హమ్మ‌రికి సోక‌నియ‌కుండా జాగ్ర‌త్త‌లు ప‌డ‌లాని ప్ర‌భుత్వాలు తెలుపుతున్నాయి.

దీంతో ఇబ్బందులు త‌ప్ప‌టం లేదు. ఇక పెళ్లిల కోసం ముహూర్తాలు పెట్టుకున్న‌వాళ్లు చాలా మంది వాయిదా వేసుకుంటున్నారు. ఇరువైల నుంచి న‌లుగురు ముగ్గురు కంటే ఎక్కువ లేకుండా వివాహాలు చేసుకుంటున్నారు. విశాఖ‌ప‌ట్నంలోనూ రెండు పెళ్లిళ్లు అంతే బంధువులు, వాయిద్యాలు లేకుండా, పెళ్లి తతంగం కానిచ్చారు. వివ‌రాల్లోకి వెళితే…

విశాఖ‌ప‌ట్నం జిల్లా అన‌కాప‌ల్లిలోని గవరపాలెంలో పెళ్లి కొడుకు మహేశ్‌తో పాటు ఏడుగురు, తాకాశి వీధిలో పెళ్లికొడుకు ఈశ్వరరావు అత‌ని తోపాటు ఏడుగురు మాత్రమే ఉండి పెళ్లి తంతు ముగించారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, వారి తల్లిదండ్రులు, పెళ్లి చేసే పురోహితుడు మాత్రమే ఉండేటట్లు కేవలం ఏడుగురితో... రెండు జంట‌ల వివాహ‌లు జ‌రిగాయి.

లాక్‌డౌన్ ముందే కుదుర్చుకున్న ముహుర్తాల వారు సంబంధిత అధికారుల అనుమ‌తుల‌తో.. పరిమితమైన జనం అంటే కేవలం ఏడుగురితోనే పెళ్లి పూర్తి చేస్తున్నారు. దీంతో బంధువులు, పందిరిళ్లు, వాయిధ్యాలు లేక పెళ్లిల్లు క‌ళ త‌ప్పుతున్నాయి. మ‌ర కొంద‌రూ ఇలా పెళ్లి చేసుకునే బ‌దులు మ‌రికొన్ని ప‌రిస్థితులు స‌ద్దుమణిగాక పెళ్లి చేసుకోవాల‌ని వాయిదా వేసుకున్నారు. 

Tags:    

Similar News