Bus Accidents: వరుస బస్సు ప్రమాదాలతో ఉలిక్కిపడుతున్న తెలుగురాష్ట్రాలు

కర్నూలు ఘోర బస్సు ఘటన మరువక ముందే చేవెళ్లలో ప్రమాదం పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్న ప్రయాణికులు తాజాగా ఏలూరు జిల్లా జూబ్లీనగర్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బోల్తా ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు వ్యక్తులు మృతి

Update: 2025-11-04 05:59 GMT

Bus Accidents: వరుస బస్సు ప్రమాదాలతో ఉలిక్కిపడుతున్న తెలుగురాష్ట్రాలు 

తెలుగురాష్ట్రాలను వరుస రోడ్డుప్రమాదాలు భయపెడుతున్నాయి. ఒక విషాదం నుంచి తేరుకోక ముందే మరో ఘోరం వెంటాడుతోంది. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లినవారు క్షేమంగా ఇంటికి వస్తారా అనే నమ్మకం లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న చేవెళ్ల రోడ్డుప్రమాదంలో 20మందికి పైగా మృతిచెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా ధామాజిపల్లి జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న జబ్బర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఐచర్ వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఏలూరు జిల్లా లింగపాలెం జూబ్లీనగర్ దగ్గర ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా... పలువురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News