Satish Dhavan Space Centre: శ్రీహరికోట షార్ కేంద్రం లో కరోనా కల్లోలం
Satish Dhavan Space Centre: షార్ కేంద్రంలో కరోనా సోకి ఇప్పటి వరకు 13 మంది మృత్యువాత పడ్డారు.
Satish Dhavan Space Centre:(File Image)
Satish Dhavan Space Centre: ఏపీలో కరోనా మహమ్మారి ఉధృతి మరింత తీవ్రమౌతోంది. రోజు రోజుకూ పాటివ్ కేసులు ఊహించనంత వేగంగా పెరుగుతోంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రంలో కరోనా కల్లోలం రేపుతోంది. దీంతో అంతరిక్ష కేంద్రంలో తాత్కాలికంగా పనులు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. షార్ కేంద్రంలో కరోనా సోకి ఇప్పటి వరకు 13 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో సైంటిస్టులు, టెక్నికల్ సిబ్బంది ఉన్నారు. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. శ్రీహరికోట లో ప్రత్యేక కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేయాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.
కరోనా సెంకండ్ వేవ్ ఏపీలో విజృంభిస్తోంది. నిత్యం వేల కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే ప్రజల రద్దీకి దూరంగా ఉండే షార్ కేంద్రంలో కరోనా విలయతాండవం చేయడం భయాందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే 50 శాతం సిబ్బందితో శ్రీహరికోట షార్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. వరుస మరణాలు సంభవిస్తుండటంతో విధులకు వెళ్లేందుకు సిబ్బంది వెనకడుగు వేస్తున్నారు.