Representational Image
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సొంత జిల్లాలో పర్యటించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ. వైఎస్సార్‌కు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని, రాజ్యాంగ వ్యవస్థల పట్ల గౌరవం ఉన్న వ్యక్తి వైఎస్సార్ అని కొనియాడారు. నిజాన్ని నిర్భయంగా చెప్పే తనను ఏ శక్తి అడ్డుకోలేదని స్పష్టం చేశారు నిమ్మగడ్డ. రాజ్యాంగాన్ని అమలుచేస్తున్న తనను అడ్డుకోవడం దారుణమని ఆయన అన్నారు.
భావ స్వేచ్ఛతో ఎన్నికలు జరగాలని, ఓటు వేసినప్పుడే ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. సుప్రీంకోర్టు కూడా ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సమర్థించిందన్న నిమ్మగడ్డ.. కొన్నిచోట్ల పరిధికి లోబడి ఏకగ్రీవాలను స్వాగతిస్తున్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పోలీసు యంత్రాంగం అద్భుతమైన ఏర్పాట్లు చేసిందని తెలిపారు నిమ్మగడ్డ.