School holidays: ఈ రోజు,రేపు స్కూళ్లు బంద్ అన్నారు..అసలు ఈ రోజు స్కూల్ ఉందా? లేదా?

School holidays: ఏపీలో ప్రయివేట్ స్కూళ్లు ఈ రోజు, రేపు బంద్ అని.. దీంతో తెలంగాణలో కూడా కాలేజీలు బంద్ చేస్తున్నాయనే వార్తలు వచ్చాయి.

Update: 2025-07-03 04:58 GMT

School holidays: ఈ రోజు,రేపు స్కూళ్లు బంద్ అన్నారు..అసలు ఈ రోజు స్కూల్ ఉందా? లేదా?

School holidays: ఏపీలో ప్రయివేట్ స్కూళ్లు ఈ రోజు, రేపు బంద్ అని.. దీంతో తెలంగాణలో కూడా కాలేజీలు బంద్ చేస్తున్నాయనే వార్తలు వచ్చాయి. దీంతో అందరూ ఈ రోజు నుంచి వరసగా నాలుగు రోజులు శెలవులు వస్తున్నాయని అనుకున్నారు. అసలు ఈ రోజు, రేపు స్కూళ్లు బంద్ ఉన్నాయా? ఈ రోజు ఏపీలో స్కూళ్లను ఓపెన్ చేశారా? లేదా? ఇదే అనుమానాలు ఇప్పుడు అందరికీ . అయితే తాజా సమాచారం ప్రకారం, ప్రయివేట్ స్కూల్ యాజమాన్యం ఇచ్చిన బంద్ పిలుపు రద్దయింది. దీంతో స్కూళ్లు యాధావిధిగా నడుస్తున్నాయి.

నిన్న ఏపీలో ప్రయివేట్ స్కూళ్లు.. తెలంగాణలో కాలేజీలు బంద్ చేస్తున్నాయని.. పిల్లలు ఎవరూ స్కూళ్లకు రావద్దని విద్యార్దులందరికీ ఆయా విద్యాలయాల నుంచి మెసేజ్‌లు వచ్చాయి. దీంతో ఈ రోజు స్కూళ్లు లేవనే చాలామంది అనుకున్నారు. కానీ ఈ రోజు స్కూళ్లు యధావిధిగా నడుస్తున్నాయి.

నిన్న ప్రయివేట్ స్కూళ్లన్నీ ఈ రోజు బంద్‌కు పిలుపునిచ్చాయి. అదికారులు అవనసరమైన జోక్యం, ఆధారాలు లేని RTE 12(1)(C) ప్రవేశాలు, పరిహారం లేకుండా అమలు చేస్తుండటం అలాగే అన్యాయంగా నోటీసులు ఇవ్వడం వంటి పలు కారణాలతో ప్రయివేట్ స్కూళ్లు ఈ రోజు బంద్‌కు దిగాయి.

ఈ నేథ్యంలో స్కూల్ యాజమాన్యాలు తల్లిదండ్రులకు స్వయంగా మెసేజ్‌లు పంపారు. అయితే ఇవాళ పరిస్థితి మారిపోయింది. స్కూల్‌ ఉందని స్కూల్ యాజమాన్యం వెల్లడించింది. ప్రభుత్వంతో జరిగిన చర్చలు విజయం అయ్యాయని, అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారని, దీనివల్ల బంద్‌ను విరమించుకుంటున్నట్లు తెలిపింది. దీంతో ఈ రోజు స్కూళ్లు సాధారణంగా నడుస్తాయి. తల్లిదండ్రులు విద్యార్దులను స్కూళ్లకు పంపొచ్చు.

Tags:    

Similar News