కాకినాడ జిల్లాలో సర్వాంగ సుందరంగా తిరునామ కళ్యాణ కొబ్బరిబోండాలు
Kakinada: పూసలు, ముత్యాలతో కొబ్బరిబోండాల రూపకల్పన
కాకినాడ జిల్లాలో సర్వాంగ సుందరంగా తిరునామ కళ్యాణ కొబ్బరిబోండాలు
Kakinada: కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లలమామిడాకు చెందిన సూక్ష్మ కళాకారుడు ద్వారంపూడి యువ రాజారెడ్డి శంకు చక్ర తిరునామ కళ్యాణ కొబ్బరిబోండాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పూసలు, ముత్యాలతో నయనానందకరంగా కళ్యాణ క్రతువులు ఉపయోగించే కొబ్బరిబోండాలను తీర్చిదిద్దారు. గత 14 సంవత్సరాలుగా శ్రీ సూర్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవమునకు ఈ కొబ్బరిబోండాలను సమర్పించడం జరుగుతుందని తెలిపారు.