బోండా ఉమకు ముందుగానే ఎలా తెలిసింది? : సజ్జల

ఏపీలో ప్రతిపక్షం మీడియా స్వేచ్ఛను హరిస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మీడియాలో కథనాలు ప్రసారం చేయకూడదని కోర్టుకు..

Update: 2020-09-16 10:00 GMT

ఏపీలో ప్రతిపక్షం మీడియా స్వేచ్ఛను హరిస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మీడియాలో కథనాలు ప్రసారం చేయకూడదని కోర్టుకు వెళ్లడం విడ్డురంగా ఉందని అన్నారు. మీడియా స్వేచ్ఛను పరిరక్షించడానికి కోర్టులు పాటుపడెయి.. కానీ నిన్న రాత్రి అది రివర్స్ అయిందని అన్నారు. మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్ పై ప్రాథమిక సమాచారంతో ఎఫ్ఐఆర్ నమోదు అయిందని.. ఆయన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ఇందులో తొందరపాటు లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో దేశంలోని అత్యంత బలమైన శక్తులు ఏకమయ్యాయా అనే అనుమానం తనకు వస్తుందని అన్నారు. టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా వేసిన మరో పిటిషన్‌పై కూడా స్టే వచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతుందని భావిస్తే సీబీఐ దర్యాప్తు కోరవచ్చు కదా అని ప్రశ్నించారు.

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ పై విచారణ ఆషామాషాగా చేసింది కాదని... ఆధారాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ కు సంబంధించి మీడియాలో రాకూడదు అంటూ రాత్రికి రాత్రి ఆదేశాలు రావడం భంగం కలిగినట్లు భావిస్తున్నామని.. పెద్దలకు ఒక తీర్పు...సామాన్యులకు ఒక తీర్పు అనేలా పరిస్థితి ఉందని సజ్జల అన్నారు.. నిజంగా ముఖ్యమంత్రి జగన్.. కొందరిని వేదించడానికె ఈ పని చేశారు అనుకుంటే సీబీఐ విచారణకు అదేశించవచ్చు అని అన్నారు. ఇదిలావుంటే టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు వీటిపై తీర్పు వస్తుందని మంగళవారం 5 గంటలకే చెప్పారని... ఆయనకు ఎలా తెలిసిందని సజ్జల అడిగారు. ఇన్సైడర్ ట్రేడింగ్ లో సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి కుమార్తెలు ఉన్నట్లు తెలిసిందని.. వారికి తెలిసో తెలియకో ఏదయినా జరిగిందో అని తెలుసుకోవడానికి విచారణ కూడా చేయకూడదా అని అన్నారు సజ్జల.  

Tags:    

Similar News