కాపు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ.. అధికార పార్టీకి కొత్త తలనోప్పి

Update: 2019-08-02 01:07 GMT

ఏపీలో అధికార పార్టీకి కొత్త తలనోప్పి వచ్చింది. మెన్నటి వరకూ సక్సస్ తో ఎంజాయ్ చేసిన వైసీపీలో ఇటీవల రెండు వరుస సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. భయట నుండే అనేక విమర్శలు వస్తున్నా ఇటీవల ఎదురైన రెండు సామాజిక సమస్యలపైనే ఆ పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఏపిలో రెండు సామాజిక వర్గాల రిజర్వేషన్ల అంశం మరో సారి తెరపైకి వచ్చింది. ఓవైపు కాపుల రిజర్వేషన్లు మరోవైపు ఎస్సీ వర్గీకరణ అంశం అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇవే అంశాలు రాజకీయ పార్టీల మధ్య విమర్శల ప్రతి విమర్శలకు దారి తీస్తున్నాయి. రిజర్వేషన్ల అంశం ఇతర పార్టీల కంటే అధికార పార్టీ వైసీపీకే ఎక్కువ తలనొప్పిగా తయారయ్యింది.

గత ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. కేంద్రం నుండి వచ్చే పది శాతం రిజర్వేషన్లు ఐదు శాతం కాపులకు ఇస్తామని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత రాష్ర్టంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్ల అంశం టెక్నికల్ గా సాధ్యం కాదని.. కేంద్రం పరిధిలోనిదే అంటుంది. ప్రభుత్వం నిర్ణయంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగా ఉంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాపులకు రిజర్వేషన్ అంశం సాధ్యం కాదు వదిలేద్దామని కొందరు అంటుంటే.. మరికొందరు ప్రయత్నం చేద్దామంటున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల సీఎం జగన్ అసెంబ్లీలోనూ చర్చించారు.

ఇక ఎస్సీ వర్గీకరణ అంశం మరో తలనోప్పిగా మారింది. అసెంబ్లీలో వర్గీకరణ సాద్యంకాదని సీఎం జగన్ చెప్పడంతో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందక్రిష్ట మాదిగ తీవ్ర విమర్శలు చేశారు. అంతే కాకుండా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. వర్గీకరణపై కొందరు సీఎం జగన్ దగ్గర ప్రస్తావించడంతో కొంత మంది ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు. వర్గీకరణ సాద్యం కాదనేది ఓ వర్గంలో కాస్త కలవరం రేపింది. వర్గీకరణ కేంద్రం పరిదిలోనిదని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కొందరు ఎమ్మెల్యేల అభిప్రాయపడుతున్నారు. రిజర్వేషన్ల అంశంపై అధికార పార్టీ ఏ విధంగా డీల్ చేస్తుందన్నది రాజకీయా వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. 

Full View

Tags:    

Similar News