శ్రీశైలంలో మరోసారి అన్యమత ప్రచారం కలకలం

శ్రీశైలంలో మరోసారి అన్యమత ప్రచారం కలకలం రేపుతోంది.

Update: 2019-12-28 07:30 GMT

శ్రీశైలంలో మరోసారి అన్యమత ప్రచారం కలకలం రేపుతోంది. రుద్రపార్క్ లో మతగ్రంధాలతో నలుగురు అన్యమతస్థులు ప్రవేశించారని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వెంటనే శ్రీశైలం పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించింది. దాంతో శ్రీశైలం దేవస్థానానికి వచ్చిన పోలీసులు అన్యమస్తస్థుల వద్ద ఉన్న మత గ్రంధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మతగ్రంధాలతో అక్కడ ప్రార్ధన నిర్వహించేందుకు వారు ప్రయత్నించారని పోలీసులు కనుగొన్నారు. కాగా గతంలో కూడా ఆర్టీసీ టిక్కెట్లపై అన్యమత ప్రచారాలు ఉన్నట్లు వెలుగుచూసిన సంఘటన తిరుమలలో కలకలం సృష్టించింది.

తిరుమలలో ఆర్టీసీ టిక్కెట్ల వెనుకభాగాన అన్యమతం ప్రచారం ఉన్నట్లు అప్పట్లో చర్చనీయాంస్యమైంది. అలాగే తిరుమల కొండమీద శిలువ ఉందని, టీటీడీ వెబ్ సైట్ లో యేసయ్యా అనే పదం కూడా ఉందని ఈ మధ్య దుమారం రేగింది. అయితే ఇది ప్రచారమే అని తేలిపోయింది. గత కొన్నేళ్లుగా శ్రీశైలం, తిరుమల దేవస్థానం పరిధిలోకి అన్యమతస్థులు వచ్చి అన్యమత ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో హిందూ దేవాలయాల వద్ద ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై యాక్షన్ తీసుకుంటోంది వైసీపీ ప్రభుత్వం. ఇప్పటికే పలు హిందూ ఆలయాల్లో ఇతర మతాలకు చెందిన ఉద్యోగులను తొలగిస్తూ జీవో జారీ చేసింది. 

Tags:    

Similar News