West Godavari: పశ్చిమ గోదావరిలో రికార్డు కోడి పందెం.. రూ.1.53 కోట్లు గెలిచిన పందెం రాయుడు
West Godavari: ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటుండగా, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోనసీమ ప్రాంతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
West Godavari: పశ్చిమ గోదావరిలో రికార్డు కోడి పందెం.. రూ.1.53 కోట్లు గెలిచిన పందెం రాయుడు
West Godavari: ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటుండగా, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోనసీమ ప్రాంతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కోనసీమ సంక్రాంతి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కోడిపందేలు. ఈ ఏడాది కూడా ఆ సంప్రదాయం కొనసాగింది. భారీ స్థాయిలో జరిగిన కోడిపందేలతో రెండు రోజుల్లోనే దాదాపు రూ.20 కోట్ల వరకు నగదు లావాదేవీలు జరిగినట్లు సమాచారం.
పందెం రాయుళ్లు సమయం, జాతకం, ముహూర్తం చూసుకుని తమ కోళ్లను బరిలోకి దింపుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో కోడిపందేలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. గురువారం జరిగిన పందేలలో భారీగా డబ్బులు చేతులు మారాయి.
ఈ క్రమంలో ఓ వ్యక్తి కోడిపందెంలో ఏకంగా రూ.1.53 కోట్లను గెలుచుకుని రికార్డు సృష్టించాడు. రాజమండ్రికి చెందిన రమేష్ అనే వ్యక్తి ఈ ఘనత సాధించాడు. గుడివాడ ప్రభాకర్ కోడి, రాజమండ్రి రమేష్ కోడి మధ్య జరిగిన భారీ పందెంలో రమేష్ కోడి ప్రత్యర్థిని పూర్తిగా ఓడించింది. దీంతో రమేష్‌కు రూ.1.53 కోట్ల లాభం దక్కింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఏడాది ఇదే అతిపెద్ద కోడిపందెం అని స్థానికులు చెబుతున్నారు. ఇక కోనసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారుతూ స్థానికంగా హాట్ టాపిక్‌గా మారాయి.