వారికి అమరావతి బానిసత్వం తప్ప సీమ పౌరుషం ఎక్కడుంది? : పురుషోత్తం రెడ్డి

Update: 2020-01-05 03:04 GMT

కర్నూలులో రాజధాని పెడితే వరద ముప్పు ఉంటుందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ ఎమ్ పురుషోత్తం రెడ్డి.చంద్రబాబు కర్నూలును వరద ముంపు ప్రాంతంగా చిత్రీకరణ చేయడం సరికాదన్నారు. అప్పట్లో వచ్చిన వరదను అంచనా వేయడంలో వైఫల్యం , శ్రీశైలం గేట్ల ఆపరేషన్ సరిగా చేయక పోవడంతోనే ముంపు సంభవించిందని అన్నారు. మానవ తప్పిదం వల్ల జరిగిన ముంపు తప్ప అమరావతి లాగా సహజ సిద్ధమైన ముంపుకు గురయ్యే ప్రాంతం కాదని సమాధానమిచ్చారు.

అంతేకాదు అమరావతి నుంచి రాజధానిని తరలించాలి అనుకుంటే తమను కర్ణాటక లేదంటే తమిళనాడులో కలపాలని టీడీపీ నేతలు చేస్తున్న డిమాండును కూడా ఆయన తప్పుబట్టారు. అమరావతి కోసం రాయలసీమను ముక్కలు చేయాలా ? అని ప్రశ్నించారు. అనంతపురంను కర్ణాటకలో , చిత్తూరును తమిళనాడులో కలపాలని డిమాండు చేస్తున్న తెలుగుదేశం నేతలు నేరుగా రాయలసీమకు ఏమి కావాలో అడగకుండా.. అమరావతి రాజధాని కాకపపోతే మమ్మల్ని వేరే రాష్ట్రాల్లో కలిపేయండి అని అడగటంలో.. అమరావతి బానిసత్వం తప్ప రాయలసీమ పౌరుషం ఎక్కడుంది? అని టీడీపీ నేతలు అమర్నాధ్ రెడ్డి, తిక్కారెడ్డిలకు ప్రశ్నలు సంధించారాయన.

Tags:    

Similar News