Ramachandra Yadav: సీఎం జగన్ పాలనలో దోపిడీలు పెరిగాయి
Ramachandra Yadav: రాష్ట్ర సంపదను సీఎం జగన్ దోచేస్తున్నారు
Ramachandra Yadav: సీఎం జగన్ పాలనలో దోపిడీలు పెరిగాయి
Ramachandra Yadav: 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దోపిడీలు పెరిగిపోయాయని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర సంపదను లూఠీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా పోరాటాలు చేసే వారిని వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. గత నాలుగేళ్ల నుండి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 35 వేల కోట్లు దోపిడీ చేసారని చెప్పారు.65 సూటు కేసు కంపెనీలు సృష్టించి, సొంతవారిని డైరెక్టర్ లుగా నియమించి అక్రమాలకు పాల్పడి వేల కోట్లు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.