Purandeswari: ఏపీలో పొత్తులపై బీజేపీ అధిష్టానానిదే నిర్ణయం
Purandeswari: రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాం
Purandeswari: ఏపీలో పొత్తులపై బీజేపీ అధిష్టానానిదే నిర్ణయం
Purandeswari: ఏపీ పొత్తులపై బీజేపీ అధిష్టానానిదే అంతిమ నిర్ణయమన్నారు ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపైనే ఫోకస్ పెట్టామన్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ కోసం చాలా మంది ముందుకొచ్చారని.. షెడ్యూల్ వచ్చాక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇక ఏపీలో దొంగ ఓట్లపై తమ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. దొంగ ఓట్ల నమోదుపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు.