TDP-Janasena: ఈనెల 28న ప్రత్తిపాడులో టీడీపీ, జనసేన బహిరంగ సభ
TDP-Janasena: ఎక్కడా టికెట్ల విషయంలో గ్యాప్ లేదు
TDP-Janasena: ఈనెల 28న ప్రత్తిపాడులో టీడీపీ, జనసేన బహిరంగ సభ
TDP-Janasena: రాబోయే ఎన్నికల్లో ఉమ్మడిగా బరిలోకి దిగుతోన్న టీడీపీ, జనసేన పార్టీలు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలు, ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు ఈనెల 28న నిర్వహించనున్న బహిరంగ సభపై చర్చించారు. ప్రతీ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు విభేదాలు లేకుండా పనిచేసేలా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఈనెల 28న జరిగే సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇక టికెట్లు, సీట్ల పంపకాల విషయంలో రెండు పార్టీల మధ్య ఎలాంటి గ్యాప్ లేదన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.