నెల్లూరు జిల్లాలో ప్రైయివేటు ట్రావెల్స్ బస్సు బోల్తా
Nellore: 25 మందికి తీవ్ర గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం, బల్లారి నుంచి నెల్లూరు వైపు వస్తుండగా ప్రమాదం
Private Travels Bus Overturns in Nellore District
Nellore: నెల్లూరు జిల్లాలో ఓ ప్రయివేటు ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. బల్లారి నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు మర్రిపాడు మండలం కండ్రిగ సమీపంలోని జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. ఈఘటనలో బస్సులో ఉన్న సుమారు 25 మంది ప్రయాణికలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ అజాగ్రత్తవల్లే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.