లైంగిక దాడికి ప్రయత్నం.. పూజారికి భక్తులు బడిత పూజ

విజయవాడ ఓ పూజారికి భక్తులు బడిత పూజ చేశారు. అసభ్యంగా ప్రవర్తించడంతో కూర్చోబెట్టి మరీ చితక్కొట్టారు. తప్పయిందని ఒప్పుకునేవరకు దేహశుద్ధి చేసి.. చివరికి పోలీసులకు అప్పగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2019-08-22 07:33 GMT

విజయవాడ ఓ పూజారికి భక్తులు బడిత పూజ చేశారు. అసభ్యంగా ప్రవర్తించడంతో కూర్చోబెట్టి మరీ చితక్కొట్టారు. తప్పయిందని ఒప్పుకునేవరకు దేహశుద్ధి చేసి.. చివరికి పోలీసులకు అప్పగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాష్‌నగర్.. నిదానంపాటి అమ్మవారి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న కుప్పం బాలాజీ గుడికి వచ్చే మహిళా భక్తులతో అసభ్యంగా ప్రవర్తించాడు. 16 ఏళ్ల బాలిక ఇటీవల గుడికి వచ్చింది. ఆమె ఆరోగ్యం కోసం పూజలు చేయాలని పూజారిని కోరింది. అయితే పూజలు చేస్తానని చెప్పి గుడి బయట ఉన్న అతడి గదిలోకి తీసుకెళ్లాడు.

గదిలోకి వెళ్లిన తరువాత అసభ్యకరంగా ప్రవర్తించి, బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించడంతో భయపడిన బాలిక, ఇంటికి పరుగు తీసి, కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు. పూజారి వికృతచేష్టలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళాలందరూ కలిసి పూజారికి దేహశుద్ధి చేశారు. నిత్యం వేదమంత్రోచ్ఛరణతో భక్తులను అశీర్వదించాల్సిన అర్చకుడు వక్రదృష్టితో చూడటంపై మండిపడ్డారు. అసభ్యంగా ప్రవర్తించిన పంతులుపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Full View 

Tags:    

Similar News