Volunteers: ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై పొలిటికల్ వార్
Volunteers In AP: వాలంటీర్ల రోజు జీతం బూమ్ బూమ్ బీర్ కంటే తక్కువన్న పవన్
Volunteers In AP: ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై పొలిటికల్ వార్
Volunteers: ఏపీలో పొలిటికల్ రగడకు వాలంటీర్ వ్యవస్థ కేంద్ర బిందువుగా మారింది. వారాహి యాత్రలో వాలంటీర్ వ్యవస్థపై పవన్ విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో పవన్ కామెంట్స్‌పై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు పవన్‌కు వ్యతిరేకంగా వాలంటీర్ల నిరసనలు,ధర్నాలు చేస్తున్నారు. వాలంటీర్ల నుంచి వ్యతిరేకత రావడంతో... తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూనే మరోసారి వాలంటీర్లను పవన్ కల్యాణ్ టార్గెట్ చేశారు.
వాలంటీర్ల రోజు జీతం బూమ్, బూమ్ బీర్ కంటే తక్కువంటూ ఎద్దేవా చేశారు. మరో వైపు వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్యభర్తల మధ్య గోవలతో వాలంటీర్లకు సంబంధం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. పార్టీ పనులు వాలంటీర్లు చేయాల్సిన పనేంటని చంద్రబాబు అన్నారు. ఇటు పవన్ అటు చంద్రబాబు వ్యాఖ్యలతో వాలంటీర్ వ్యవస్థ చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి.