AP Elections: ఉరవకొండ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అవుతుందా..?
AP Elections: మరి రాబోయే ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల్లో హవా ఎవరిది..?
AP Elections: ఉరవకొండ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అవుతుందా..?
AP Elections: ఏపీలో ఎన్నికల వేళ మరోసారి ఉరవకొండ సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేదానికన్నా ఉరవకొండ అసెంబ్లీ స్థానంలో ఏ పార్టీ అభ్యర్థి ఓడిపోతారు అనే విషయంపైనే ఎక్కువ ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ నియోజకవర్గ గెలుపోటములపైనే.. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టబోతోందో ముంచే అంచనా వేయొచ్చు. సాధారణంగా పలానా నియోజకవర్గంలో గెలిస్తే పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంటుంది.
కానీ ఇక్కడ మాత్రం సెంటిమెంట్ రివర్స్. ఉరవకొండలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే.. ఆ పార్టీ ప్రతిపక్షానికే పరిమితం అవుతుంది అనే సెంటిమెంట్ నడుస్తోంది. అంటే ఇక్కడ ఎమ్మెల్యేగా ఓఢిన పార్టీనే రాష్ట్ర్రంలో అధికారంలోకి వస్తుంది అనమాట. చెప్పుకోవడానికి కొంత వింతగా ఉన్నా ఇదే నిజం. గత ఎన్నికల ఫలితాలను చూస్తే.. ఇది నిజమే అనిపిస్తుంది.
1999నుంచి ఉరవకొండలో ఈ సెంటిమెంట్ కంటీన్యూ అవుతోంది. 1999 ఎన్నికల్లో ఉరవకొండలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. 2004, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పయ్యావుల కేశవ్.. గెలుపొందగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి వై. విశ్వేశ్వరరెడ్డి గెలుపొందగా టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. 2019 ఎన్నికల్లో నాలుగోసారి పయ్యావుల గెలుపొందగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది.
దీంతో ఉరవకొండలో ఏ పార్టీ అభ్యర్థి ఓడిపోతే... ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ బలబడింది. 2019ఎన్నికల్లో రాయలసీమ మొత్తం వైసీపీ గాలి వీచింది. టీడీపీ కేవలం 3స్థానాల్లోనే గెలిచింది. అందులో ఒకటి ఉరవకొండ. అంతటి వైసీపీ గాలిని తట్టుకొని పయ్యావుల నిలబడితే.. ఇటు టీడీపీ ఘోరంగా ఓడి అధికారం కోల్పోయింది. దీంతో 2024ఎన్నికల్లో ఉరవకొండలో ఎవరు గెలుస్తారు.? ఎప్పటిలాగే ఈసారి కూడా సెంటిమెంట్ రిపీట్ అవుతుందా లేక.. సాంప్రదాయాన్ని చేధిస్తారా అనేది ఆసక్తిగా మారింది.
ఇక అనంతపురం జిల్లాలోనే మరో సెంటిమెంట్ కూడా ఉంది. అదే శింగనమల సెంటిమెంట్. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపొందుతారో ఆ పార్టీ అభ్యర్థి అధికారంలోకి రావడం సెంటిమెంట్‌గా నడుస్తోంది. ఈ ఏడాది కూడా అదే జరిగింది. గత 7 సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందితే ఆ పార్టీనే అధికారంలోకి వచ్చింది.
ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి విజయం సాధించడంతో రాష్ట్రంలో వైసీపీ అధికారం చేజిక్కించుకుంది. దీంతో శింగనమల సెంటిమెంట్ మరోసారి రుజువు అయింది. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే సెంటిమెంట్ కంటీన్యూ అవుతుందా.. ఇక్కడ గెలిచిన పార్టీనే రాష్ట్రంలోనే అధికారంలోకి వస్తుందా అనేది చూడాలి.
ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగిన డిస్ట్ర్రిక్ట్గ్ గా ఏపీ రాజకీయాలను శాషిస్తూ వస్తున్నాయి ఉభయగోదావరి జిల్లాలు. ఉమ్మడి తూగో జిల్లాలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అంటే రెండు జిల్లాల్లోనే 34అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ అత్యధిక స్థానాలను సాధించిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ఉండేది. గత ఎన్నికలలో పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలకు గాను 13 చోట్ల వైసీపీ గెలిచింది.
రెండు ఎంపీ స్థానాలు కూడా దక్కాయి. తూర్పుగోదావరి జిల్లాలోనూ 19 స్థానాలకు గాను వైసీపీ 14 చోట్ల గెలిచింది. మరి ఈసారి ఉభయ గోదావరి జిల్లాల్లో సత్తా చాటేది ఎవరు.. అధికారంలోకి వచ్చేది ఎవరు అనే ఆసక్తి నెలకొంది. ఉభయగోదావరి జిల్లాల్లో కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈసారి పవన్, చంద్రబాబు కలిసి పోటీ చేస్తుండటంలో..కాపు సామాజికవర్గం ఎవరివైపు నిలుస్తారనే చర్చ జరుగుతోంది. మొత్తానికి ఎన్నికలు దగ్గరపడటంతో.. రాజకీయ సెంటిమెంట్లపై చర్చ నడుస్తోంది.