కోడి పందాలు నిర్వహించే గ్రామాల్లో తనిఖీలు.. 264 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్న పోలీసులు

West Godavari: సంక్రాంతి కోడి పందాల కట్టడికి పోలీసుల కఠిన చర్యలు

Update: 2023-01-10 02:46 GMT

కోడి పందాలు నిర్వహించే గ్రామాల్లో తనిఖీలు.. 264 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్న పోలీసులు

West Godavari: సంక్రాంతి కోడి పందాలను కట్టడి చేసేందుకు పోలీసులు వ్యూహాత్మక చర్యలు తీసుకుంటున్నారు. కోడి పందాలు నిర్వహించే గ్రామాల్లో అనుమానితులపై ముందుగానే బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్నారు. చట్ట విరుద్ధంగా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం తోలేరు గ్రామంలో తాపీ మేస్త్రిగా పనిచేస్తున్న ముత్యాలపల్లి సుబ్రహ్మణ్యం ఇంటిని పోలీసులు తనిఖీ చేశారు. సోదాల్లో 264 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరవాసరం మండలంలోని కొణితివాడ, నవుడూరు గ్రామాల్లో కోడి పందాలు నిర్వహించే అవకాశమున్న నాలుగు స్థలాలను ట్రాక్టర్‌లతో దున్నించి ధ్వంసం చేశారు. రూరల్‌ సర్కిల్‌ పరిధిలో 270 మందిని గుర్తించి బైండోవర్‌ కేసులు నమోదు చేశారు.

Tags:    

Similar News