Galla Jayadev: ఎంపీ గల్లాను గుంటూర్ సబ్‌జైలుకు తరలింపు

Update: 2020-01-21 02:54 GMT

సోమవారం అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంత సేపు హైడ్రామా నడిచిన తరవాత అరెస్ట్ జయదేవ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ని మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ‌్యంలోనే టీడీపీ కార్యకర్తలు, అనుచరులు ఆయన్ని తరలిస్తున్న కాన్వాయ్ ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేసారు. పోలీస్ స్టేషన్ కు తరలించడానికి ముందు ఆయనకి అర్థరాత్రి 12.30 గంటలకు జీజీహెచ్‌ వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహించారు.

జయదేవ్‌ను దుగ్గిరాల, పెదకాకాని, గుంటూరు మీదుగా నరసరావుపేటకు తరలించారు. అనంతరం అక్కడి నుంచి రొంపిచర్ల స్టేషన్‌కు తరలించారు. తరువాత ఆయనపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. అనంతరం పొద్దున్న మూడు గంటలకు మంగళగిరి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఈ నేపథ‌్యంలోనే ఆ‍యన బెయిల్ కోసం ప్రయత్నించగా.. మంగళగిరి మేజిస్ట్రేట్ నిరాకరించి, జనవరి 31వరకు రిమాండ్ విధించారు. అంనంతం అక్కడి నుంచి ఆయన్ని తెల్లవారు జామున 4.30గంటలకు గుంటూరు సబ్ జైలుకి తరలించారు.

ఇకపోతే ఉదయం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన గల్లా జయదేవ్ పై పోలీసులు దాడి చేశారని.. తన చొక్కా చించేశారని ఆయన పోలీసులపై మండిపడ్డారు. తనకు తాకిన దెబ్బల్ని అందరి ముందు చూపించారు. ప్రభుత్వం తీసుకున్న అప్రజాస్వామికమై నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్తున్నానని, తన తాత కూడా బ్రిటీష్‌వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకు వెళ్లారని తెలిపారు. తాను కూడా అమరావతి కోసం తన పోరాటం సాగిస్తానని తెలిపారు.




Tags:    

Similar News