వైసీపీ నేత బైరెడ్డి పై పోలీస్ కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తుంది. ప్రజలెవరూ రోడ్లపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిత్యావసరాల కోసం ప్రజలు బయటకు వస్తే మాస్క్ ధరించ డం తో పాటు సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చేయవారిపై చర్యలు చేపడుతున్నారు.. ప్రతినిధులు, రాజకీయ నేతలపైనా కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. తాజాగా కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామిపై.. నందికొట్కూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ఆదివారం లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని, హైపో ద్రావణం పిచికారీ చేసేందుకు వచ్చిన వారు భౌతిక దూరం పాటించలేదని, దీంతో వారి అనుచరులపై కూడా కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్ నిబంధనలు పాటించాల్సిందేనని, ఒకవేళ పట్టించుకోకపోతే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు లాక్‌డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై కూడా కేసు నమోదైన సంగతి తెలిసిందే.