అప్రమత్తంగా ఉండండి.. ఏపీ సిఎం జగన్ కు ప్రధాని మోడీ సూచన!

కరోనా నియంత్రణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు.

Update: 2020-04-06 01:50 GMT
PM Modi, YSJagan(File Photo)

కరోనా నియంత్రణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రధాని మోడీ ఫోనులో సిఎం జగన్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడానికి గల కారణాలు.. కరోనాను నివారించడానికి తీసుకుంటున్న చర్యలను జగన్ ఈ సందర్భంగా ప్రధానికి వివరించారు.

అంతే కాకుండా రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితులను కూడా ప్రధాని మోడీకి సిఎం జగన్ తెలిపారు. పౌర సరఫరాల శాఖకు సంబంధించి రూ.2,200 కోట్లు.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.2,100 కోట్లు.. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు స్థానిక సంస్థలకు రూ.1,100 కోట్లు.. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు రూ.1,050 కోట్ల.., జీఎస్టీ పరిహారం కింద రూ.900 కోట్లు ఇప్పించాలని ప్రధానిని కోరారు. ఈ విషయాలపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోడీ తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.




Tags:    

Similar News